పోస్టాఫీస్ సేవింగ్స్‌లో అకౌంట్ ఉందా.. అయితే మీరు..

పోస్టాఫీస్ సేవింగ్స్‌లో అకౌంట్ ఉందా.. అయితే మీరు..
బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తం సున్నాకు చేరితే ఖాతా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.

మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌ అకౌంట్ ఉందా.. అయితే ఇకపై క్రమం తప్పకుండా రూ.500 కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. డిసెంబర్ 11 నాటికి ఖాతాదారులకు కనీస నగదు నిల్వ ఉండాలని డిపార్ట్‌మెంట్ సూచించింది. లేనిపక్షంలో బ్యాంక్ ఖాతా నుంచి రూ.100 ప్లస్ జీఎస్టీని మెయింటెనెన్స్ ఫీజు రూపంలో కట్ చేస్తారు.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ప్రస్తుతం 4 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. ఈ ఖాతా తెరవాలంటే కనీసం రూ.500 ఉండాలి. డిపాజిట్ రూ.50 ల నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తం సున్నాకు చేరితే ఖాతా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. వడ్డీ రావాలంటూ పదో తేదీ నుంచి ఇరవయ్యో తేదీ మధ్యలో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. రూ.500 కంటే తగ్గితే వడ్డీ కలపరు. కేంద్ర ఆర్థిక శాఖ సూచనలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం చివర్లో వడ్డీని ఖాతాలో కలుపుతారు.

ఆదాయ పన్ను చట్టం 80 టీటీఏ ప్రకారం ఓ ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో వడ్డీల ద్వారా వచ్చిన రూ.10వేల లోపు ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ ఏ ఖాతా ద్వారా అయినా మూడేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరగపోతే.. సంబంధిత పోస్టాఫీస్‌లో అప్లికేషన్‌తో పాటు కేవైసీ డాక్యుమెంట్లు, పాస్‌బుక్ సమర్పించాల్సి ఉంటుంది.

Tags

Next Story