రెమ్యునరేషన్ వద్దన్న ఎన్టీఆర్.. ఎందుకంటే..

రెమ్యునరేషన్ వద్దన్న ఎన్టీఆర్.. ఎందుకంటే..
తారక్ బుల్లితెర మీద కూడా మంచి పాపులారిటిని సంపాదించుకున్నారు.

యంగ్ యమ ఏం తీసుకోవట్లేదట.. ఏం తీసుకోవట్లేదంటే.. కాస్త అర్థమయ్యేలా చెప్పండని ఆవేశపడిపోకండి.. వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిపోతున్న తారక్ బుల్లితెర మీద కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. మరోసారి మైక్ పట్టబోతున్న ఎన్టీఆర్ ఈసారి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్. కోట్లు డిమాండ్ చేసినా కాల్షీట్లు ఇవ్వని జూనియర్ ఎన్టీఆర్ పైసాకూడా తీసుకోకుండా పనిచేయడం ఏమిటి అని అందరికీ ఆశ్చర్యం. అయితే ఇందులోనే ఉంది ట్విస్టు. తానే ఓ ప్రోగ్రామ్‌కి నిర్మాతగా మారనున్నారని సమాచారం. పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే నిర్మాతకి ఇంక రెమ్యునరేషన్‌తో పనేం ఉంటుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags

Next Story