బుల్లితెరపై మరోసారి సందడి చేయనున్న తారక్..

నందమూరి వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టి వెలిగిపోతున్న తారక్ బుల్లి తెర ప్రేక్షకులనూ తన మాటలతో మెస్మరైజ్ చేస్తాడు. గతంలో బిగ్‌బాస్ సీజన్ 1కి హోస్ట్ చేసి అలరించాడు. వీకెండ్ కోసం తారక్ కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన డైలాగులు చెప్పే విధానం, పంచులు, కామెడీ టైమింగ్ అన్నీ ప్రేక్షకులకు నచ్చేవి. తాజాగా మరోసారి బుల్లి తెరలోకి రావడానికి ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో ప్రసారం కానున్న ఓ రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని చిత్రపరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సెట్‌ని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసినట్టు సమాచారం.
కాగా, తారక్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. కొమరం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మహాబలేశ్వరంలో జరిగింది. ఇక్కడ తారక్-చెర్రీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఆర్ఆర్ఆర్ తరువాత.. త్రివిక్రమ్‌తో మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com