Odisha : పెళ్లి కోసం 28 కిలోమీటర్లు నడిచిన వరుడు

Odisha : పెళ్లి కోసం 28 కిలోమీటర్లు నడిచిన వరుడు
ఒడిశాలో డ్రైవర్ల సమ్మె కారణంగా వరుడు అతని కుటుంబ సభ్యులు వెహికిల్ ఏర్పాటు చేసుకోలేక పోయారు

పెళ్లి చేసుకోవడానికి ఓ వరుడు 28 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలో డ్రైవర్ల సమ్మె కారణంగా వరుడు అతని కుటుంబ సభ్యులు వెహికిల్ ఏర్పాటు చేసుకోలేక పోయారు. రాయగడ జిల్లా కళ్యాణ్ సింగ్ పూర్ బ్లాక్ లోని సునాఖండి పంచాయతీకి చెందిన 22 ఏళ్ల వరుడు నరేష్ ప్రస్కాకు గురువారం దిబలపాడు గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరగాల్సి ఉంది. డ్రైవర్ల సమ్మె కారణంగా పెళ్లికి వెహికిల్స్ అందుబాటులో లేవు. చేసేదేమి లేక వధువు ఇంటికి వరుడు అతని కుటుంబం 28కిలోమీటర్లు నడిచివెళ్లారు.

వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఎనిమిది మంది మహిళలు 28కిలోమీటర్లు నడిచి శుక్రవారం తెల్లవారుజామున గమ్యస్థానికి చేరుకున్నారు. వరుడు పెళ్లికూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది. సమ్మె విరమించకపోవడంతో నూతన దంపతులు, బంధువులు వధువు ఇంటి వద్దే ఉండిపోయారు.

డ్రైవర్ల సమ్మె...
భీమా, పించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు, తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగింది. డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 90రోజులు తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు డ్రైవర్స్ యూనియన్ తెలిపింది. రెండు లక్షల మందికి పైగా డ్రైవర్లు సమ్మె చేయడంతో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే ప్రజల సాధారణ జీవితానికి ఆటంకం కలిగింది. పర్యాటకులు చిక్కుకు పోయారు.

Tags

Read MoreRead Less
Next Story