జాతీయం

CM Naveen Patnaik : జంతువుల ఆకలి పట్టించుకున్న సీఎం..!

CM Naveen Patnaik : అందరు సీఎంల కంటే తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించుకున్నారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.

CM Naveen Patnaik : జంతువుల ఆకలి పట్టించుకున్న సీఎం..!
X

CM Naveen Patnaik : అందరు సీఎంల కంటే తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించుకున్నారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. వీధి జంతువుల ఆకలి తీర్చేందుకు రూ.67.52 లక్షలు కేటాయించారు. లాక్ డౌన్లో వాటికి ఆహారం పెట్టేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ టైంలో దుకాణాలు, హోటళ్లన్నీ మూసి ఉండటం వల్ల వీధి కుక్కలు, ఇతర జంతువులకు ఆహారం దొరకట్లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమం కోసం ఈ ఏడాది రెండు విడతల్లో రూ.1,13,94,000 విడుదల చేశారు. దీనికి అదనంగా గురువారం రూ.67.52 లక్షలు మంజూరు చేశారు. కాగా ఒడిశాలో గురువారం కొత్తగా 8,839 కోవిడ్ -19 కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 7,90,970 కు పెరగగా, మొత్తం మరణాల సంఖ్య 2,873కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 85,423 గా ఉంది.

Next Story

RELATED STORIES