పీఎం, సీఎం సార్లు మమల్నీ పట్టించుకోండి..!

కరోనా మహమ్మారి కారణంగా విద్యాలయాలు ఎక్కడికక్కడే మూతపడ్డాయి. దీనితో విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌లో క్లాసులని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించాయి. అయితే కొన్ని చోట్లల్లో నెట్‌వర్క్ సదుపాయం లేకా చాలా మంది విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు. కొందరు చెట్లెక్కి, కొండలు ఎక్కి చదువుకున్న సంఘటనలు కూడా సోషల్ మీడియాలో మనం చూసే ఉన్నాం.
అలాగే ఇక్కడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న తొమ్మిది గ్రామాలకు చెందిన విద్యార్థులు తమకు నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖలు రాశారు. మీరావలి, దుర్గాపాడు, పిప్పిలిగుడ, కారుడాయి, బొడొ అలుబడి, కూలి, బాయిసింగి, డంగలొడి, హలువ గ్రామాలకు చెందిన విద్యార్థులు పీఎం, సీఎంకు రాసిన రెండు లేఖలను మంగళవారం మీరావలి పోస్టాఫీసులో పోస్ట్ చేశారు.
ఎటువంటి నెట్‌వర్క్ లేకపోవడంతో ఆయా గ్రామాలకి చెందిన విద్యార్దులు ఆన్లైన్ క్లాసులకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళమని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని అందుకే తాము పీఎం, సీఎంకు లేఖలు రాశామని అంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారనే ఆశతో తామంతా ఉన్నామని విద్యార్దులు అంటున్నారు. ఇక్కడ నెట్‌వర్క్ సదుపాయంతో పాటుగా అత్యవసర సమయంలో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడుతోందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com