Rahul Gandhi : మాయావతికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశాం.. కానీ : రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ .. బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించి ఆమెకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసిందని, అయితే ఆమె తమతో మాట్లాడలేదని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.
ఢిల్లీలో జరిగిన 'ద దళిత్ ట్రూత్' అనే పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.. కొందరు రాజకీయ నాయకులు అంతటా అధికారం కోసం ప్రయత్నిస్తుంటారన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా తమతో కలవాలని మాయవతిని కోరినట్లు చెప్పారు రాహుల్ గాంధీ.
కానీ ఈడీ,పెగాసస్‌లకు భయపడి మాయవతి మాట్లాడలేకపోయిందన్నారు. కాన్షీరామ్ దళితుల కోసం ఎంతో చేశారన్నారు రాహుల్. ఇక తానెప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదని రాహుల్ అన్నారు. అధికారంపై నాకు ఆసక్తి లేదని, ప్రస్తుతం దేశాన్ని అర్థం చేసుకుంటున్నాని అన్నారు.
కాగా ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక బీఎస్పీ కేవలం ఒకే ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. దాదాపు 72 శాతం మంది బీఎస్పీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com