ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనలు!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఈనెల 6న దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు జాతీయ రహదారులు దిగ్బంధించాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. అటు.. సింఘూ, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.
సింఘూ, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలతో భద్రతా చర్యలు పెంచారు. యూపీ నుంచి ఢిల్లీ వచ్చే రహదారులపై బారీకేడ్లు, ఇనుప కంచెలు, కందకాలు ఏర్పాటు చేశారు. రోడ్లపై ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. రైతు నిరసనలు, దాడులను తట్టుకునేలా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం రంగంలోకి దిగింది. రక్షణ కవచం, స్టీలు లాఠీ, హెల్మెట్ ధరించిన ప్రత్యేక పోలీసు బృందాలు పహారా కాస్తున్నాయి. నిరసన కారులను ఆమరదూరంలో ఉంచేందుకు వీలుగా వీటి రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com