Owaisi: పచ్చరంగుతో ప్రాబ్లెం ఏంటి?
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పచ్చరంగుతో అసలు సమస్య ఏంటని హైదారాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటులో నిలదీశారు. ఇలా అయితే జాతీయ జెండా నుంచి పచ్చ రంగును తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. చైనా చొరబాటుపైనా, బిల్కిస్ బానో కేసుపైనా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. కేంద్ర బడ్జెట్ 2023లో మైనారిటీలకు కేటాయించాల్సిన నిధుల్లో భారీగా కోతలు విధించారని ఆరోపించారు. మైనారిటీ శాఖకు 38శాతం మేర నిధుల్లో కోత వేశారని దుయ్యబెట్టారు. ఈ దేశంలో ఇస్లామ్ మతస్థులు చదువుకోకూడదన్నదే మోదీ ఉద్దేశమని అన్నారు. ఆయనకే తమ మీద అంత ప్రేమ ఉంటే ముస్లిమ్ లకు దళిత హోదా కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. బీహార్ లోనూ ముస్లిమ్ లు ఓబీసీ స్టేటస్ కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేెశారు. ఇక హిడెన్ బర్గ్ సంస్థ భారత్ లో ఉండి ఉంటే దానిపై లెక్కలేనని దాడులు జరిగి ఉండేవని ఓవైసీ తెలిపారు. చివరిగా ప్రార్థనా స్థలాల్లో అలజడి సరికాదని, చైనాకు భయపడపద్దని, మైనారిటీలకు బడ్జెట్ పెంచాలని ఓవైసీ ప్రధానిని కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com