Uttar Pradesh: జైల్లో ఉన్న యజమాని.. బెంగతో మరణించిన పెట్ డాగ్

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ యొక్క పెంపుడు కుక్క ప్రయాగ్‌రాజ్‌లోని అతని ఇంట్లో ఆకలి, దాహంతో మరణించింది. యూపీ మాజీ మంత్రి ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. అతని మరో నాలుగు కుక్కల పరిస్థితి కూడా విషమంగా ఉంది. గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుక్క బ్రూనో అలనా పాలనా చూసే యజమాని కనిపించడం లేదని తిండి, తిప్పలూ మానేసింది. దాంతో చిక్కి శల్యమై మరణించింది. అతిక్ అహ్మద్ వద్ద ఐదు విదేశీ జాతి కుక్కలు ఉండగా ఒక కుక్క మరణించింది. మిగిలిన నాలుగు కుక్కల పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ఇరుగుపొరుగు వారు కుక్కలకు ఆహారం, నీరు అందిస్తే ఏం జరుగుతుందో అనే భయంతో మిన్నకుండి పోయారు. ఇంతకీ ఈ అతిక్ అహ్మద్ ఎవరు? 2005లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో నిందితుడు అతిక్ అహ్మద్. అతిక్, అతని భార్య షైస్తా పర్వీన్, వారి ఇద్దరు కుమారులు, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com