Padma shri : 20 రూపాయిల డాక్టర్... ప్రజలకు ఆదర్శం

Padma shri : 20 రూపాయిల డాక్టర్... ప్రజలకు ఆదర్శం
X
ఇరవై రూపాయిల డాక్టర్ కు పద్మశ్రీ; ఆసుపత్రిని మూసేయమని ఎంతమంది ఒత్తిడి చేసిన కరగని వైనం....

భారత ఆర్మీ అంటే దేశ ప్రజలకు పూనకాలు వస్తాయి. ఆర్మీ చేసే సేవ, బలిదానాలే అందుకు కారణం. 77 ఏండ్ల ఓ ఆర్మీ డాక్టర్ తన రిటైర్మెంట్ అయ్యక కూడా ప్రజలకు సేవచేస్తున్నాడు. అదీ, 20 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుని వైద్యం అందిస్తున్నారు. ఆ డాక్టర్ కు పద్మశ్రీ ఇచ్చి గౌవరించింది భారత ప్రభుత్వం.

మధ్య ప్రదేశ్ కు చెందిన డాక్టర్ మునీశ్వర్ చందర్ దావర్ (77) ను పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 77 ఏళ్ల వయసులో కూడా పేదవారి కోసం వైద్యాన్ని అందిస్తున్నారు దావర్. జనవరి 16, 1946లో పాకిస్తాన్ లో జన్మించారు దావర్. విభజన తర్వాత భారతదేశానికి వచ్చారు. 1967లో జబల్పూర్ నుంచి MBBSను పూర్తి చేశారు. 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యంలో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత జబల్ పూర్ పేద ప్రజలకు తక్కువ ఫీజుతో వైద్యాన్ని అందిస్తున్నారు. రూ.2తో చికిత్స చేయడం ప్రారంభించిన దావర్... తన ఫీజును రూ.20 రూపాయలకు పెంచారు.

తమ కుటుంబంలో చాలా సార్లు తక్కువ ఫీజుతో వైద్యం ఎందుకు అందిస్తున్నరని ప్రశ్నించారని తెలిపారు. ఆ తర్వాత వారే అర్థం చేసుకున్నారని అన్నారు. బంధువులైతే తన హాస్పిటల్ ను మూసివేయమని సలహా ఇచ్చారని చెప్పారు. మనం కష్టపడి పనిచేస్తే విజయం ఎప్పటికైనా వరిస్తుందని, ఒక్కో సారి లేటుకావచ్చని తెలిపారు.

Next Story