నటి ఆత్మహత్య.. కాబోయే భర్తతో హోటల్‌లో.. అంతలోనే..

నటి ఆత్మహత్య.. కాబోయే భర్తతో హోటల్‌లో.. అంతలోనే..
తెల్లవారుజామున 2:30 గంటలకు తన హోటల్ గదికి తిరిగి వచ్చారని

తమిళ చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 28. టీవీ, సినిమా ప్రపంచానికి ఈ వార్త షాక్ ఇచ్చింది. పాండియన్ స్టోర్స్ అనే పాపులర్ షోలో ముల్లై పాత్ర పోషించినందుకు ఆమెకు మంచి పేరు వచ్చింది. నటి నజరేత్‌పేట్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉరివేసుకున్నారు. వీజే చిత్ర ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు తన హోటల్ గదికి తిరిగి వచ్చారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. ఆమె తన కాబోయే భర్త, వ్యాపారవేత్త హేమంత్‌తో కలిసి హోటల్‌లో ఉన్నారు. వారిద్దరికీ కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది.

వీజే చిత్ర తమిళ పరిశ్రమలోని వివిధ టీవీ ఛానెళ్లలో ప్రెజెంటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌లో ముల్లై పాత్ర ద్వారా భారీగా అభిమానులను సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరించేది.

నిరాశ కారణంగానే వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆమె మరణం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఒక ట్విట్టర్ యూజర్ ఇలా వ్రాశాడు, "నటి చిత్ర ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. చాలా ప్రతిభావంతులైన నటి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. మరొకరు ఇలా ట్వీట్ చేశారు, "వెరీ టాలెంటెడ్ డాన్సర్ & అత్యుత్తమ నటి .. ఇతర వ్యక్తులు మీ పాత్రను పాండియన్‌స్టోర్స్‌లో భర్తీ చేయలేరు" అని పోస్ట్ చేశారు.

Tags

Next Story