Parliament : శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయింపు

Parliament : శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయింపు
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పార్టీ పేరు, గుర్తును పొందిన తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన క్షణాల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది

పార్లమెంట్ లోని శివసేన కార్యాలయాన్ని ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించారు. ఇందుకు గాను, లోక్ సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. షిండే వర్గానికి చెందిన ఫ్లోర్ లీడర్ రాహుల్ షెవాలే రాసిన లేఖపై లోక్ సభ సెక్రేటేరియట్ స్పందిస్తూ, పార్లమెంట్ భవనంలోని శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు స్ఫష్టం చేసింది.

పోల్ ప్యానెల్ గత వారం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించింది. ఎన్నికలలో విల్లు, బాణం గుర్తులను షిండే వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చింది. ఇప్పటి వరకు పార్లమెంట్ భవనంలోని శివసేన కార్యాలయాన్ని ఇరు వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే.. పార్టీ పేరు, గుర్తును పొందిన తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన క్షణాల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వాన్ని ప్రేరేపిస్తూ, ఉద్దవ్ ఠాక్రే.. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్న క్రమంలో... షిండే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీ గుర్తును, పేరును షిండే వర్గానికి కేటాయించిన తర్వాత శివసేన నేతలు మీటింగ్ కు హాజరుకానున్నారు. ఇందులో కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది.


శివసేన గుర్తును, పేరును షిండే వర్గానికి కేటాయించగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్దవ్ ఠాక్రే. ఈ పిటీషన్ పై బుధవారం మధ్యహ్నం 3.30 గంటలకు విచారణ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story