14 Sep 2020 12:32 PM GMT

Home
 / 
జాతీయం / ఎంపీలకు కోవిడ్ కిట్..

ఎంపీలకు కోవిడ్ కిట్..

ఈ సెషన్ అసాధారణ పరిస్థితులలో జరుగుతోంది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించే సభ్యులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

ఎంపీలకు కోవిడ్ కిట్..
X

పార్లమెంటు వర్షాకాల సమావేశానికి హాజరయ్యే సభ్యులందరికీ కోవిడ్ మహమ్మారి నుండి రక్షించేందుకు కిట్లు ఇవ్వబడ్డాయి. ఈ రోజు ప్రారంభమైన 18 రోజుల సెషన్‌లో అనేక భద్రతా చర్యలకు లోబడి సమావేశాలు జరుగుతాయి. డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) అందించిన కిట్‌లను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం ఎంపీలకు పంపారు.

ప్రతి కిట్లో 40 మాస్కులు ఒకసారి వాడి పడేసేవి, ఐదు ఎన్ -95 మాస్కులు, 50 మి.లీ చొప్పున 20 శానిటైజర్ బాటిల్స్, ఫేస్ షీల్డ్స్, 40 జతల గ్లౌజులు, డోర్లు తెరవడానికి, మూసివేయడానికి టచ్-ఫ్రీ హుక్ తో పాటు టీ బ్యాగులు ఉన్నాయి. ప్రతి కిట్‌లో ఎంపీల కోసం కోవిడ్ సేఫ్టీ మాన్యువల్ కూడా ఉంటుంది. 2020 సెప్టెంబర్ 14 న ప్రారంభమైన ఈ సమావేశాల మధ్యలో ఎటువంటి సెలవు లేకుండా అక్టోబర్ 1 వరకు ఉంటుంది. ఈ సెషన్ అసాధారణ పరిస్థితులలో జరుగుతోంది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించే సభ్యులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి అని బిర్లా పార్లమెంటు సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

"మీ సౌకర్యార్ధం నేను ఈ లేఖతో పాటు శానిటైజేషన్ కిట్‌ను పంపుతున్నాను. డీఆర్ డీవో అందించిన ఈ కిట్‌లో శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్ మొదలైనవి ఉన్నాయి. సభ కార్యకలాపాలను నిర్వహించడంలో మీ పూర్తి సహకారాన్ని అందిస్తారని నేను భావిస్తున్నాను అని బిర్లా చెప్పారు. పార్లమెంట్ భవన సముదాయంలో భారీ భద్రతా చర్యల మధ్య ఈ సమావేశం జరుగుతోంది. ఈ ఉభయ సభల గదులలో కూర్చొని ఉన్న ఎంపీలు, భౌతిక దూరాన్ని కొనసాగించేందుకు వీలుగా గ్యాలరీలు, సభలో పాలీ-కార్బన్ షీట్లతో సీట్లను వేరు చేశారు. కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు ఇప్పటికే కరోనావైరస్ బారిన పడ్డారు. మరికొంత మంది చట్టసభ సభ్యులు దాని నుండి కోలుకుంటున్నారు. ఒక ఎంపీతో సహా అనేక మంది ఎంల్ఎలు మరణించారు. 785 మంది ఎంపీలలో 200 మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.

Next Story