Parliament Session : రాజ్యసభ స్పీకర్ కు వేలు చూయించిన జయ బచ్చన్

బాలీవుడ్ సీనియర్ నటి, రాజ్యసభ ఎంపీ వివాదాల్లో ఇరుక్కున్నారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొన్న ఆవిడ, రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధంకర్ పై వేలు చూపిస్తూ బయటకు వెళ్లారు. దీంతో బచ్చన్ పై తీవ్ర దుమారం రేగింది. ఓ గౌరవ రాజ్యసభ ఎంపీ అయుండి.. రాజ్యసభ స్పీకర్ పైనే వేలు చూపించడం సభ్యతకాదని బీజేపీ నాయకులు అన్నారు. ఆవిడ వేలు చూపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో వైరల్ అవుతోంది. ఈ వీడియోనే షేర్ చేసిన పలువురు నాయకులు ఖండించారు. రాజ్యసభలో జయబచ్చన్ చర్య ఆమోదయోగ్యమైనది కాదని బీజేపీ నాయకులు అజయ్ సెహ్రావత్ పేర్కొన్నారు.
అదానీ వ్యవహారంలో పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల గందరగోళం మధ్య... అనూహ్యంగా జయాబచ్చన్ రాజ్యసభ స్పీకర్ పై వేలు చూపిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. క్లిప్ లో ఆమె లేచి హౌస్ ఆఫ్ వెల్ వైపు నడుస్తూ, రాజ్యసభ సభ్యులను కూర్చోవాలని కోరుతున్న స్పీకర్ వైపు వేలు చూపడం సంచలనమైంది. జయ బచ్చన్ చర్యను విమర్శించిన బీజేపీ అధికార ప్రతినిధి అనేజా కపూర్, క్లిప్ ను షేర్ చేస్తూ.. కొన్ని పార్టీల విలువలు వేరుగా ఉండొచంచు. కానీ.. రాజ్యసభ ఎంపీ పదవి గౌరవాన్ని జయ బచ్చన్ కాపాడుకోవాలని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com