ప్లాట్‌పామ్‌పై ఉమ్మివేసిన వ్యక్తి.. శుభ్రం చేయించిన ప్రయాణీకులు

ప్లాట్‌పామ్‌పై ఉమ్మివేసిన వ్యక్తి.. శుభ్రం చేయించిన ప్రయాణీకులు
పాన్‌లు నమలడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అయితే పాన్ మరకలు మరింత ఎక్కువగా ఉంటాయి.

పాన్‌లు నమలడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అయితే ఈ ప్రహసనం మరింత ఘోరంగా ఉంటుంది. తోటి ప్రయాణీకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండదు. రోడ్డు మీద, బస్టాండ్లో, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తుంటారు. ఇలాగే ఉమ్మివేసిన ప్రయాణీకుడికి తోటి ప్రయాణీకులు బుద్ది చెప్పారు. కుంట బస్టాండ్‌లో పాన్‌ నములుతూ ఉమ్మి వేస్తున్న ప్రయాణికుడిని వారించి అతడి చేతే శుభ్రం చేయించారు. కార్వార్‌కు బస్సులో వెళుతున్న వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌పై పాన్‌ నమిలి ఉమ్మి వేయడంతో, ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నవారు ఆగ్రహించి, ఉమ్మివేయడానికి ఇది ప్రదేశమా అని అడిగారు. ఒక ప్రయాణికుడు అతనిని "నువ్వు అంత అసభ్యంగా ఎలా ప్రవర్తిస్తున్నావు?" అతడు స్పందించకముందే, అక్కడ గుమిగూడిన ప్రతి ఒక్కరూ నీ వద్ద ఉన్న బట్టతో ఆ స్థలాన్ని శుభ్రం చేయమని డిమాండ్ చేశారు. అప్పుడే బస్ బయలుదేరబోతోంది. నేను వెళ్లాలి అన్నాడు. ఎక్కడికి వెళ్లేది.. ముందు శుభ్రం చేయి తరువాత కదులు అని గట్టిగా అనడంతో చేసేదేం లేక బట్ట, నీరు తెచ్చి తాను ఊసిన పాన్ మరకలను స్వయంగా శుభ్రం చేశాడు. ఈ ఘటన మొత్తం మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Tags

Next Story