ప్రిన్స్ మహేష్‌కి క్రిస్మస్ గిప్ట్ పంపిన పవన్..

ప్రిన్స్ మహేష్‌కి క్రిస్మస్ గిప్ట్ పంపిన పవన్..
పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజొనేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక

ఆత్మీయులతో ఆనందంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజొనేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక అందించారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. పవన్, అన్నా దంపతులకు ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు. పవన్ వారికి చాక్లెట్ బాక్స్‌తో పాటు ఒక చిన్న నోట్ కూడా జతపరిచారు.

ఇంతకు ముందు కూడా ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌తో పవన్ బిజీగా ఉన్నారు. రానా దగ్గుబాటితో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించేందుకు సన్నహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ఖరారు కానుంది. మరోవైపు టాలీవుడ్‌లోని మరికొందరి ప్రముఖుల ఇంట కూడా క్రిస్మస్ సందడి మొదలైంది.

అల్లు అర్జున్, సామ్-చాయ్ కుటుంబాలు ఇప్పటికే క్రిస్మస్ చెట్టు అలంకరణకు సంబంధించిన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర సందర్భంగా నటులు తమ సన్నిహితులకు బహుమతులు పంచుకోవాలని కోరుకుంటారు.

Tags

Next Story