ఎయిర్‌పోర్ట్‌లో పవన్ చిన్న కుమార్తె.. ఎంత సింపుల్‌గా..: నెటిజెన్స్ కామెంట్

ఎయిర్‌పోర్ట్‌లో పవన్ చిన్న కుమార్తె.. ఎంత సింపుల్‌గా..: నెటిజెన్స్ కామెంట్
అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్-అన్నాలెజినోవాల కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ హైదరాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. ఇటీవల తన తల్లితో కలిసి రష్యాకు వెళ్లిన వీళ్లిద్దరూ తాజాగా నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వీళ్లని చూసి గుర్తుపట్టిన అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.కుమార్తె అంజనా పవనోవా అచ్చం తండ్రిలానే సింపుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రష్యాలో జన్మించిన అన్నా లెజినోవా పవన్‌తో కలిసి 'తీన్ మార్' చిత్రంలో నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ సెప్టెంబర్ 30, 2013లో ఎర్రగడ్డ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Tags

Next Story