Paytm: కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన పేటిఎం UPI

Paytm: డిజిటల్ పేమెంట్స్‌కు పేరు పొందిన పేటిఎం UPI...ఛార్ కా హండ్రెడ్ పేరుతో కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం క్రికెటర్స్ యజువేంద్ర చాహల్, హర్భజన్ సింగ్, క్రిస్ గేల్‌ను ప్రచారకర్తలుగా నియమించుకుంది. విండీస్-ఇండియా మ్యాచ్ జరిగే రోజుల్లో పేటీఎం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన వారికి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది.
కొత్త వినియోగదారులు మనీ ట్రాన్స్‌ఫర్‌పై కచ్చితంగా వంద రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుందని తెలిపింది. రిఫరల్ ప్రొగ్రామ్‌లో పాల్గొంటే దీనికి అదనంగా క్యాష్ బ్యాక్ వస్తుందని స్పష్టం చేసింది. రిఫరర్, రిఫరీ ఇద్దరికి వంద రూపాయల క్యాష్ వస్తుందని తెలిపింది. ఈ ఆఫర్‌ను ప్రమోట్ చేసేందుకు చాహల్, హర్భజన్ సింగ్, క్రిస్ గేల్‌ను నియమించుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com