పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం

Parliament
X

Parliament

Pegasus: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తోంది.

Pegasus: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తోంది. NDA వ్యతిరేక పక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. స్పైవేర్‌ వ్యవహారంపై JPC వేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌..హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అటు నిన్న రాజ్యసభలోనూ ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్‌ చేతిలో నుంచి కాగితాలను లాక్కొని.. టీఎంసీ ఎంపీ సుశాంత్ సేన్ విసిరేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనలో ఎంపీ సుశాంత్‌సేన్‌ను సస్పెండ్ చేసే యోచనలో ఉంది కేంద్రం. మరోవైపు హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పటిషన్ దాఖలైంది. ధర్మాసనం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలంటూ ఎడిటర్స్ గిల్డ్ సహా...అన్ని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

Tags

Next Story