పెన్షన్ తీసుకునే వారు డిసెంబర్ 31 లోపు..

పెన్షన్ తీసుకునే వారు డిసెంబర్ 31 లోపు..
X
ఆన్‌లైన్ ద్వారా ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది

పెన్షన్ తీసుకునే వారు ప్రతి ఏడాది నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ డాక్యుమెంట్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి అందించాలి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీంతో సీనియర్ సిటిజన్స్ ఎక్కడికీ వెళ్లకుండానే పని పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 64 లక్షల మంది ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పిస్తున్నారు.

మీకు పెన్షన్ అందిస్తున్న బ్యాంక్ వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ యాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌వో తాజాగా ట్విట్టర్ వేదికగా లైఫ్ సర్టిఫికెట్ అంశాన్ని తెలియజేసింది. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన వారు కచ్చితంగా ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. లేకపోతే వారికి పెన్షన్ రాదు. లైఫ్ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకులు ఆ వ్యక్తి జీవించి ఉన్నారా లేదా తెలుసుకుంటాయి.

Tags

Next Story