బీహార్ ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా వేయాలని ఆరాష్ట్రంలోని మెజార్టీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓ వైపు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సిద్దం అవుతుంటే.. బీహార్‌కు చెందిన రాష్ట్రవాదీ జనతా పార్టీ ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అక్టోబర్, నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను 2021 మార్చిలో నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. సోమవారం ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రాన్ని ఓవైపు కరోనా అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు వరదలతో కరువు మరింత ఆందోళన కలిగిస్తుందని పిటిషనర్ తెలిపారు. ఎన్నికలు వాయిదా వేయాలని మెజార్టీ పార్టీలు కోరుతున్నాయి. పార్టీలన్ని కలసి ఎన్నికల సంఘానికి కూడా లేఖలు గతంలో రాశారు. అయితే, ఈసీ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com