భగ్గుమంటున్న పెట్రోల్ ధర.. రూ. 90కి చేరువలో..

భగ్గుమంటున్న పెట్రోల్ ధర.. రూ. 90కి చేరువలో..
దేశంలో పెట్రోల్ ధర భగ్గుమంటుంది. ప‌న్నెండు రోజుల‌పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధర పెరుగుతూ వస్తుంది.

దేశంలో పెట్రోల్ ధర భగ్గుమంటుంది. వరుసగా పెరుగుతున్న ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప‌న్నెండు రోజుల‌పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధర పెరుగుతూ వస్తుంది. అయితే శనివారం విరామం ఇచ్చి.. మ‌ళ్లీ ఆదివారం లీట‌ర్‌కు 9 పైస‌లు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.

ప్రస్తుతం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 88.68గా ఉంది. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో రూ.82.03కి చేరింది. చెన్నైలో రూ.85గా ఉంది. ఇక కోల్‌క‌తాలో రూ.83.52కి చేరింది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్న.. డీజిల్ ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి పెంపూ లేదు. న్యూఢిల్లీలో లీట‌రు డీజిల్ ధ‌ర రూ.73.56గా ఉంది. ఇక ముంబైలో రూ.80.11గా ఉంది. చెన్నైలో రూ.78.86, కోల్‌క‌తాలో రూ.77.06గా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story