Petrol Rates: తగ్గనున్న డీజిల్ , పెట్రోల్ ధర

రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గకపోవడంతో పెట్రోల్, డీజిల్‌తో పాటు మొక్కజొన్న వంటి కొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ద్రవ్యోల్బణం గరిష్ఠంగా ఆరు శాతం పెరగరాదని లక్ష్యంగా పెట్టుకుంది. రీటైల్ ద్రవ్యోల్బణం ఈ మధ్య కూడా ఆరున్నర శాతం పెరగడంతో ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. దీంతో ధరలు తగ్గించేందుకు ఆర్బీఐ కేంద్రానికి కొన్ని సలహాలను ఇచ్చింది. ఆర్బీఐ నిదేదికను కేంద్రం పరిశీలిస్తోందని త్వరలోనే పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని కేంద్రం తగ్గింవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. పాలు, మొక్క జొన్న, సోయా నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయని ఆర్బీఐ అంటోంది. మొక్కజొన్న దిగుమతిపై కేంద్రం ఇప్పుడు 60 శాతం సుంకం విధిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com