మహిళా జర్నలిస్ట్.. కానీ దొంగల్ని ధైర్యంగా..

మహిళా జర్నలిస్ట్.. కానీ దొంగల్ని ధైర్యంగా..
ఆమె ఓ సాధారణ మహిళ కాదు.. ఓ జర్నలిస్ట్ అన్న విషయం వారికి తెలియదు..

అమ్మాయి కదా.. అంత తేలిగ్గా ఆమె చేతికి చిక్కంలే అనుకున్నారు. ఆమె చేతిలోని మొబైల్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారు.. కానీ ఆమె వారిని అంత తేలిగ్గా విడిచిపెట్టలేదు. దూరదర్శన్ లో పని చేస్తోన్న ఓ మహిళా జర్నలిస్ట్ శనివారం మధ్యాహ్నం దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆమె చేతిలోని మొబైల్ లాక్కుని పరారయ్యారు. ఆమె ఓ సాధారణ మహిళ కాదు.. ఓ జర్నలిస్ట్ అన్న విషయం వారికి తెలియదు.. దొంగలని ఆటోలో వెంబడించింది.. బైక్ మీద పారిపోతున్న దొంగలు కంగారులో పోలీస్ బారికేడ్లకు తగిలి కింద పడ్డారు. ఆలోపే అక్కడకు చేరుకున్న జర్నలిస్ట్.. ఆటో డ్రైవర్ సాయంతో నిందితులిద్దరినీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో అప్పగించింది. విచారణలో నిందితులిద్దరూ తుగ్లకాబాద్ కు చెందిన వారిగా తెలిసింది. డ్రగ్స్ కు అలవాటు పడిన వీరు డబ్బు కొసం దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరినీ ధైర్యంగా వెంబడించి పోలీసులకు అప్పగించినందుకు పోలీసు అధికారులు ఆమెను అభినందించారు.

Tags

Next Story