Fact Check: నకిలీ మెసేజ్‌పై క్లిక్ చేస్తే అంతే సంగతులు.. అకౌంట్ ఖాళీ

Fact Check: ఏదీ నకిలీనో, ఏది అసలో గుర్తించలేని పరిస్థితి.. ప్రభుత్వం ఈ విషయంపై ఎంతగా అలెర్ట్ చేసినా చాలా మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా పాన్ కార్డ్‌ని అప్ డేట్ చేయకపోతే ఎస్బీఐ అకౌంట్ క్లోజ్ అవుతుందని మెసేజ్ వస్తోంది. దీనిపై క్లిక్ చేసారంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బంతా స్వాహా అయిపోతుందని హెచ్చరిస్తోంది ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరించింది. "ప్రియమైన కస్టమర్, ఈ రోజు మీ SBI ఖాతా మూసివేయబడింది, ఇప్పుడే సంప్రదించండి మరియు మీ పాన్ నంబర్ వివరాలను అప్‌డేట్ చేయండి" అని ఫేక్ SMS రౌండ్ అవుతోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రజలు తమ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోమని అడిగే ఇటువంటి ఇమెయిల్‌లు లేదా SMSలకు ఎప్పుడూ స్పందించకూడదని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com