బండి మీద గుడికి ప్రయాణం.. మోగిన ఫోన్.. పిలిచిన మృత్యువు

X
By - prasanna |1 Feb 2021 5:30 PM IST
కానీ ఈలోపే ఆ దేవుడు ఆమెని మృత్యుఒడికి చేర్చాడు
గత కొంత కాలంగా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది.. ఎన్ని మందులు వాడినా ఫలితం కనబడట్లేదు.. గుడికి తీసుకువెళ్లి ఆమె పేరు మీద అర్చన చేయిస్తే కాస్తైనా ఆరోగ్యం కుదుట పడుతుందేమో అని ఆశపడ్డాడు భర్త. కానీ ఈలోపే ఆ దేవుడు ఆమెని మృత్యుఒడికి చేర్చాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌కి చెందిన వెంకటేశ్ (38) ప్రైవేటు ఉద్యోగి. భార్య చిన్నమ్మ (36)ను బండెక్కించుకుని చేవెళ్ల మండలం గుండాలలోని గుడికి తీసుకువెళుతున్నాడు. ఇంతలో ఆమె ఫోన్ రింగైంది. దాన్ని బయటకు తీసే ప్రయత్నంలో అది కాస్తా చేతిలో నుంచి జారి కిందపడింది. దాంతో ఫోన్ అందుకునే క్రమంలో ఆమె పక్కకు ఒరిగింది బండి మీద ఉన్నానన్న స్పృహను కోల్పోయింది. ఈ నేపథ్యంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com