Operation Ganga: ఉక్రెయిన్ నుండి 800 మందిని తీసుకువచ్చిన 24 ఏళ్ల పైలెట్.. ఎవరీ అమ్మాయి?

Operation Ganga: ఉక్రెయిన్ నుండి 800 మందిని తీసుకువచ్చిన  24 ఏళ్ల పైలెట్.. ఎవరీ అమ్మాయి?
Operation Ganga: భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఫిబ్రవరి 26న ప్రభుత్వం ప్రారంభించిన "ఆపరేషన్ గంగా"లో మహాశ్వేతా చక్రవర్తి భాగం అయింది.

Operation Ganga: భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఫిబ్రవరి 26న ప్రభుత్వం ప్రారంభించిన "ఆపరేషన్ గంగా"లో మహాశ్వేతా చక్రవర్తి భాగం అయింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు తనూజా చక్రవర్తి కుమార్తె మహాశ్వేత. ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహాశ్వేతకు చిన్నప్పటినుంచి పైలెట్ అవ్వాలన్న కోరికను నెరవేర్చుకుంది.

మహాశ్వేతా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 800 మందికి పైగా విద్యార్థులను తరలించేందుకు ఆమె ఆరు విమానాలను నడిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో "ప్రత్యేక సైనిక ఆపరేషన్" ప్రకటించిన మూడు రోజుల తర్వాత అసలు కథ మొదలైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 ప్రతీ క్షణం ఆమెకు చాలా ముఖ్యమైనదిగా మారింది. భారతీయ ప్రైవేట్ క్యారియర్‌లో పనిచేస్తున్న చక్రవర్తి ఈ విమానాలను నడిపారు.

"ఇది నాకు లభించిన ఓ మంచి అవకాశం. యుద్ధ వాతావరణంలో ఉన్న విద్యార్థులను రక్షించడం మరిచిపోలేని అనుభవం. వీరిలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. వాళ్లందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చవలసిన బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాను. రోజుకు 13-14 గంటల పాటు ఎయిర్‌బస్ A320ని నడపవలసి వచ్చింది.

తాము క్షేమంగా ఇంటికి వెళతామో లేదో అని చాలా మంది విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు. ఒత్తిడి కారణంగానే 21 ఏళ్ల అమ్మాయికి ఫ్లైట్ ఎక్కేముందు ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఓ డాక్టర్ ఆమెకు చికిత్స చేశారు. స్పృహలోకి వచ్చిన ఆ అమ్మాయి నా చేతిని పట్టుకుని నన్ను తన తల్లి వద్దకు తీసుకెళ్లమని అడిగిన క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను" అని చక్రవర్తి గుర్తు చేసుకున్నారు.

ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి క్యారియర్‌లతో పాటు భారత సైన్యం కూడా తన మద్దతును అందించింది. తనని ఈ ప్రాజెక్టులో భాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ..

"విమానయాన సంస్థ నుండి నాకు అర్థరాత్రి కాల్ వచ్చింది. నన్ను రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. కాల్ అందుకున్న నేను రెండు గంటల్లో బ్యాగ్ సర్దుకుని వెంటనే ఇస్తాంబుల్ బయల్దేరాను" అక్కడ నుంచి పోలండ్ వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది.

పోలండ్ నుంచే విద్యార్ధుల్ని తరలించమని మాకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే పోలండ్ నుంచి నాలుగు, హంగరీ నుంచి రెండు విమానాల ద్వారా మొత్తం 800 మంది విద్యార్ధుల్ని స్వదేశానికి చేర్చాను అని గర్వంగా చెప్పింది మహాశ్వేత.

ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహాశ్వేత... మహమ్మారి సమయంలో కూడా వందే భారత్ మిషన్‌లో భాగమయ్యారు. విదేశాల నుండి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లను, వ్యాక్సిన్‌లను స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.

వృత్తిలో భాగంగా సమాజసేవలో భాగమైనందుకు చెప్పలేని ఆనందం, సంతృప్తి కలుగుతోందని అంటోంది. నాపై నమ్మకం ఉంచి సంస్థ నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు అని అంటోంది మహేశ్వరి.

ఆపరేషన్ గంగలో భాగమైన ఈ లేడీ పైలెట్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story