Pinarayi Vijayan : కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణ స్వీకారం..!

Pinarayi Vijayan : కేరళ ముఖ్యమంత్రిగా వరసగా రెండోసారి పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 21 మంది మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని బద్ధలు కొట్టి.. ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. విజయన్ సహా ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు. పినరయి విజయన్ మొదటి క్యాబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న కేకే శైలజకి ఈ సారి క్యాబినెట్ లో చోటు దక్కలేదు. ఆమె స్థానంలో జర్నలిస్టు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వీణా జార్జికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా మే 2న వెలువడిన ఫలితాల్లో 140 సీట్లకి గాను 99 స్థానాలను ఎల్‌డిఎఫ్ గెలుచుకుంది.
శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్, మంత్రులుగా ఎం.వి.గోవిందన్, కె.రాధాకృష్ణన్, కె.ఎన్.బాలగోపాల్, పి.రాజీవ్, వి.ఎన్.వాసన్, సౌజీ చెరియన్, శివన్‌కుట్టి, మహ్మద్ రియాజ్, డాక్టర్ ఆర్.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com