రాంవిలాస్ పాశ్వాన్ హఠాన్మరణంతో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న పాశ్వాన్... గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్... పాస్వాన్ పార్థివదేహానికి అంజలి ఘటించారు. పాస్వాన్ ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. పాస్వాన్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్రపతిభవన్, పార్లమెంట్‌పై జాతీయ జెండాలను అవనతం చేశారు. పట్నాలో పాస్వాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
రాంవిలాస్ పాశ్వాన్ హఠాన్మరణంతో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేశారు. పాస్వాన్ మంత్రిగా ఉన్న వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా సరఫరా మంత్రిత్వశాఖ బాధ్యతలు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ప్రధాని నరేంద్రమోదీ సలహా మేరకు గోయల్‌కు అదనపు బాధ్యతలిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్రపతి భవన్ శుక్రవారం వెల్లడించింది. అటు.. బిహార్ ఎన్నికల సమయంలో పాసవాన్ మృతిచెందడం ఆ పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com