PM Kisan Samman Nidhi: నేడే రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు..!

PM-Kisan: రైతులకి ఆర్ధిక సహాయం చేసేందుకు మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఈ పథకాన్ని మందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం కింద రైతులకి ప్రతి ఏడాది 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6 వేలు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏడు విడతలుగా నిధులని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పుడు ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం విడుదల చేయనున్నట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లుగా పేర్కొంది. ఉదయం 11 గంటలకి మోదీ ఈ సాయాన్ని విడుదల చేయనున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో మోదీ కొంతమంది లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు. కాగా ఇప్పటివరకు కిసాన్ సమ్మాన్ ద్వారా రూ. 1.15కోట్లను రైతులకి అందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com