పీఎం- కిసాన్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..!

X
By - Gunnesh UV |9 Aug 2021 10:06 AM IST
PM-KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్.
PM KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది మోదీ సర్కార్. పీఎం- కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి) నగదును రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రకటించింది. ఈ నగదు నేడు( సోమవారం) రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నాం 12.30 గంటలకు ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు రైతులతో ప్రధాని ముచ్చటించనున్నారు. పీఎం-కిసాన్ ద్వారా 9.75 కోట్ల మంది రైతులకు రూ.19,500 కోట్ల మేర నిధులు విడుదల చేయనున్నట్లు ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఏడాదికి రూ.6000 చొప్పున రైతులకు అందించే ఈ పథకంలో నాలుగు నెలలకోసారి రూ.2వేలు చొప్పున కేంద్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com