PM Modi : ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మొదటి దశ ప్రారంభం

ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ హైవేను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ - దౌసా-లాల్సోట్ సెక్షన్ ను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే మొదటి దశను ప్రారంభించిన ఆయన జాతికి అంకితం ఇచ్చారు. "ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే మొదటి దశను ప్రారంభించడం గర్వంగా ఉంది. ఇది దేశంలో అతిపెద్ద, అత్యంత ఆధునిక ఎక్స్ ప్రెస్ హైవేలలో ఒకటి. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఇది మరో గొప్ప చిత్రం. దౌసా నివాసులకు, దేశ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు.
గత తొమ్మిదేళ్లుగా, కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిరంతరం భారీ పెట్టుబడులను పెడుతోందని అన్నారు మోదీ. ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ హైవే, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్.. రాజస్థాన్ తోపాటు దేశ ప్రగతికి రెండు బలమైన స్థంబాలుగా మారబోతున్నాయని ఆయన తెలిపారు. 1386 కిలో మీటర్లలో భాగంగా... 246 కిలో మీటర్ల మొదటి దశ హైవేని ప్రారంభించారు. ఈ ఆధునిక కనెక్టివిటీ సరిస్కా టైగర్, కియోలాడియో, రణతంబోర్ నేషనల్ పార్క్, జైపూర్, అజ్మీర్ వంటి అనేక పర్యాటక ప్రదేశాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాజస్థాన్ ఇప్పటికే ప్రపంచ పర్యాటకులను ఆకర్శిస్తుందని, ఇప్పుడు దాని ఆకర్షణ మరింత పెరుగుతుందని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com