PM Modi : కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు

ప్రధాని మోదీ విద్యార్హతల వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది.. ప్రధాని విద్యార్హతను తెలిపే సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.. దీనికి సంబంధించి కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనం.. కేంద్ర సమాచార కమిషన్ ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.. అంతేకాదు, సీఎం కేజ్రీవాల్‌కు పాతికవేల రూపాయల జరిమానా కూడా విధించింది.. ప్రధాని మోదీ విద్యార్హతలపై గతంలో పలు ఆరోపణలు చేశారు కేజ్రీవాల్.. డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.. అయితే, అప్పట్లో ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార కమిషన్ పీఎంవో కార్యాలయం పీఆర్వో, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పీఐవోలను ఆదేశించింది.. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది.. తాజాగా ఈ ఆదేశాలపై గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. సీఎం కేజ్రీవాల్‌కు జరిమానా విధించింది.
అటు సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అబద్దాల ప్రచారంలో కేజ్రీవాల్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు మోదీ డిగ్రీ పట్టాకు సంబంధించి 2016 ఏప్రిల్‌లో కేజ్రీవాల్.. కేంద్ర సమాచార కమిషన్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం అందులో మోదీ విద్యార్హతలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరారు. తన గురించి ప్రభుత్వ రికార్డులు వెల్లడించేందుకు ఏం అభ్యంతరం లేదన్న కేజ్రీవాల్.. మోదీ విద్యార్హతల సమాచారాన్ని కమిషన్ ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటోందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అప్పటి కేంద్ర సమాచార కమిషన్ఛైర్మన్ఎమ్.శ్రీధర్ ఆచార్యులు.. గుజరాత్ యూనివర్సిటీకి, ఢిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com