PM Modi: అనవసరంగా వాగకండి... మోదీ వార్నింగ్..!

సినిమాల పట్ల అనవసరమైన కామెంట్లు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ మంత్రులకు సూచించారు. ఇటీవలే షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొణెే నటించిన 'పఠాన్' కాంట్రవర్సీకీ కేంద్ర బిందువు అవ్వడంతో మోదీ ఈ విధంగా స్పందించారని తెలుస్తోంది.
బేషరమ్ పాటలో దీపికా ఆరెంజ్ కలర్ బికినీ వివాదం నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని చాల మంది హిందువులు, మత పెద్దలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్ మల్టీప్లెక్స్ యజమానులకు సినిమాను థియేటర్లలో విడుదల చేయవద్దని బెదిరింపులు రావడం పట్ల ప్రభుత్వ చొరవ చేసుకొని పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆరెంజ్ బికినిపై కామెంట్లు చేశారు. మహారాష్ట్ర కు చెందిన బీజేపీ నేత రామ్ కదమ్ సినిమా జనాలు పబ్లిసిటీ కోసం ఇలాంటివన్నీ చేస్తారని విమర్శించారు. అయితే ఈ కాంట్రవర్సీ జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు సినిమాల పట్ల చేస్తున్న వాఖ్యలు మాత్రమే మీడియాలో ఎక్కువ ప్రచారం అవుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న పనులు మీడియాలో హైలెట్ కావడంలేదని మోదీ మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు ఎన్నికలకు ఎక్కువ సమయంలేదు, కాబట్టి, సినిమాల పట్ల అనవసరమైన వాఖ్యలు చేయకూడదని మోడీ తన క్యాబినెట్ మంత్రులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com