PM Modi : బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi : బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించనున్న ప్రధాని మోదీ

కర్ణాటక మాండ్య జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. మాండ్య, హుబ్బళ్లి - ధార్వాడ్ జిల్లాల్లో రూ.16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల సమయంలో కర్ణాటకలో ఎన్నికలు రానుండటంతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతంలో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రెండు నెలల్లోపే ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది ఆరోసారి.

ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు మాండ్యలో ప్రధాన మంత్రి రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హుబ్బలి - ధార్వాబ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ తర్వాత బెంగళూరు మైసూరు ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభిస్తారు. 118 కిమీ పొడవైన ఈ ప్రాజెక్ట్ మొత్తం రూ.8,480 కోట్లతో అభివృద్ధి చేయబడింది. ఈ రోడ్డుతో బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. మండ్యలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత ప్రధాన మంత్రి ధార్వాడ్ లో రూ.850 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన IIT ధార్వాడ్ ను ప్రారంభిచనున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ కు 2019 ఫిబ్రవరీలో ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story