స్వల్ప కాలిక సంతోషాల కోసం దీర్ఘకాలిక ఆనందాలను వదులుకోవద్దు : మోదీ

కరోనా విషయంలో అజాగ్రత్త వద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ... కోవిడ్ వ్యాధి వ్యాప్తి గురించి ప్రజలను అప్రమత్తం చేశారు. దేశంలో కరోనా గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా.. ముప్పు ఇంకా తొలగిపోలేదని గ్రహించాలన్నారు. దేశవాసులు నిబద్ధతతో చేసిన పోరాటం వల్లనే దేశంలో కరోనా కేసులు, మరణాలు అదుపులో ఉన్నాయని.. ఇప్పుడు నిర్లక్ష్యం వహించి పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చుకోవద్దని మోదీ సూచించారు.
శత్రువు పూర్తిగా అంతం అయ్యే వరకు విశ్రమించవద్దన్న రామచరిత మానస్‌లోని సూక్తిని ఉటంకించిన మోదీ.. కరోనాపై పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దన్నారు. అందరూ విధిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం చేయాలని ప్రధాని సూచించారు.
రానున్న పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. స్వల్ప కాలిక సంతోషాల కోసం దీర్ఘకాలిక ఆనందాలను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండడమే తాను కోరుకుంటున్నానని మోదీ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com