ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో SECకి, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.దీనిపై ఇవాళ వాదనలు కొనసాగాయి. సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాదిలాంటివి. దాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తోందని మోదీ కొనియాడారు. ఇక ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన తరుణం కూడా ఇదేనన్నారు మోదీ. ముఖ్యంగా యువత ఓటు నమోదు చేసుకుని ఓటు వేసేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాస్వామ్యం బలోపేతానికి ఎన్నికల సంఘం పాత్రను కొనియాడిన మోదీ.. ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో వివాదం కొనసాగుతున్నా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story