ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక అవార్డు!

దేశ ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డుతో సన్మానించింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్‌ను ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహూకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ చేతుల మీదుగా మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ఈ అవార్డును స్వీకరించారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకుగానూ ఆయనకు ఈ అవార్డు బహూకరించినట్లు ఓబ్రయాన్ తెలిపారు. దీంతో ఈ అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్ హోదా మోదీని వరించింది. మోదీతో పాటు ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకూ బహూకరించారు. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంది.
మోదీకి గతంలోనూ పలు దేశాల ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. 2016లో సౌదీ అరేబియా అబ్దులాజిజ్ అల్ సౌద్ అవార్డు, అఫ్గానిస్థాన్ నుంచి అమీర్ అబ్దుల్లా ఖాన్ అవార్డు, సియోల్ పీస్ ప్రైజ్-2018, రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్ అవార్డు, యూఏఈ నుంచి జాయెద్ మెడల్‌తో సన్మానించారు.
"President @realDonaldTrump presented the Legion of Merit to Indian Prime Minister Narendra Modi for his leadership in elevating the U.S.-India strategic partnership. Ambassador @SandhuTaranjitS accepted the medal on behalf of Prime Minister Modi." –NSA Robert C. O'Brien pic.twitter.com/QhOjTROdCC
— NSC (@WHNSC) December 21, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com