కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని.. మోదీకి టీకా ఇచ్చింది ఎవరంటే..!

కొవిడ్‌ టీకా తీసుకున్న ప్రధాని.. మోదీకి టీకా ఇచ్చింది ఎవరంటే..!
తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

ప్రధాన నరేంద్ర మోదీ కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు.

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఇవాల్టి నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story