కొత్త మంత్రులను సభకు పరిచయం చేసిన ప్రధాని మోదీ

Modi in Parlament
Loksabha: తొలిరోజే పార్లమెంట్ సమావేశాలు హాట్‌హాట్‌గా మొదలయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం.. ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగడంతో కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అయితే ప్రధాని మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు ధరలు, కరోనా వంటి అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కల్పించుకొని సభ్యులను వారించినా.. విపక్షాలు ఆందోళన కొనసాగించాయి.
సభ్యలు ఆందోళన మధ్యే ప్రధాని మోదీ మాట్లాడారు. ఎక్కువ మంది ఎస్సీలు మంత్రులు కావడం శుభపరిణామమన్నారు. మహిళలు, ఓబీసీలు, రైతుల బిడ్డలు మంత్రులు కావడం.. కొందరికి ఇష్టం లేకపోవడంతోనే సభను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారు మోదీ దుయ్యబట్టారు. సభ్యుల సంతాప కార్యక్రమం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాల ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా పడింది.
Viral Video: మాస్క్ లేదని.. ట్రైన్లో నుంచి తోసేసిన ప్యాసింజర్లు..ఆ తర్వాత
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com