ఈ-రూపీ వచ్చేసింది..ఎలా పని చేస్తుందంటే..?

e-RUPI: ఇక నగదు రహిత లావాదేవీలు చేయడానికి ఫోన్‌పే, గూగుల్‌పేతో వంటి యప్ లను యూస్ చాయల్సిన పని లేదు.. అవును.. దీనికి సంబంధించిన కొత్త స్కీంని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా "ఈ-రూపీ (E-RUPI)" స్కీంని ప్రవేశపెట్టనుంది. ఈ విదానం వళ్ళ నగదు రహిత లావాదేవీలు చేయడం ఇంకా సులబతరం కానుంది.
ఇది ఎలా పని చేస్తుందంటే.. ఈ-రూపీ పేమెంట్ లో నగదు చెల్లింపులకు గాను క్యూఆర్ కోడ్ లేదా ఎస్‌ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. నగదు రహిత లావాదేవీలు మరియు డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగానే "ఈ- రూపీ" పద్దతిని అమల్లోకి తేసుకోస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
అయితే తొలిదశలో ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా, మాతా శిశు అభివృద్ధి, మరియు రైతులకు సబ్సిడీ, వంటి పథకాల్లో అందిస్తున్న ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2 నుంచి ఈ-రూపీ పథకం అమలులోకి రానుంది. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌కి క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలియాల్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com