Modi UP Tour : దేశంలో హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుస్తాం : మోదీ

Modi UP Tour : ప్రజారోగ్యానికి పెద్దపీఠ వేస్తామన్నారు ప్రధాని మోదీ. ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ఆయన... సిద్ధార్థనగర్, వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారణాసి వేదిక ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీంను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఆపరేషనల్ గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నామని మోదీ తెలిపారు. వైద్య సదుపాయాల కొరత తీర్చడానికే ఈ కొత్త మిషన్ తోడ్పడుతుందన్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన వాళ్లు... హెల్త్ కేర్ రంగాన్ని గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com