నేటి స్టార్టప్ కంపెనీలే రేపటి MNCలు : ప్రధాని మోదీ

నేటి స్టార్టప్ కంపెనీలే రేపటి MNCలు :  ప్రధాని మోదీ
లోకల్‌ టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చేందుకు విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

లోకల్‌ టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చేందుకు విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒడిశాలోని సబల్‌పూర్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌- IIM శాశ్వత ప్రాంగణానికి ఆయన వర్చువల్‌గా పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోపాటుగా, కేంద్ర మంత్రి రమేశ్ పొక్రియాల్‌ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని 30 IIMలు ఉన్నాయని, ఇక్కడి టాలెంట్‌ అంతా స్వావంలంబన భారత్‌ పురోగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధిలో భాగమయ్యేలా ఆలోచనలు చేయాలన్నారు. నేడు స్టార్టప్‌గా పురుడుపోసుకున్న సంస్థలే భవిష్యత్తులో MNCలుగా మారతాయన్నారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story