వాజ్‌పేయి సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : ప్రధాని మోదీ

మాజీ ప్రధాని వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. వాజ్‌పేయి నాయకత్వంలో దేశం అభివృద్ధి పధాన నడిచిందని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. వాజ్‌పేయి చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు కూడా వాజ్‌పేయి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా జరుపుతోంది బీజేపీ.
వాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది పార్లమెంటులో 'అటల్ బిహారీ వాజ్‌పేయి: స్మారక సంపుటి' అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. లోక్ సభ సచివాలయం ప్రచురించిన ఈ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి యొక్క జీవితం, అయన రచనలను హైలైట్ చేస్తుంది . అంతేకాకుండా పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు కూడా ఇందులో ఉన్నాయి. అటు వాజ్‌పేయి నాయకత్వంలో 1990లో మొదటిసారిగా కేంద్రాన్ని పాలించింది బీజేపీ.. ఆయనకి 2015 లో భారత్ రత్న ప్రదానం చేశారు.
ఇక రాజకీయ వేత్త మదన్ మోహన్ మాల్వియా పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సహకారం తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com