Modi In Kedarnath Temple : కేదార్‌నాథ్‌లో ప్రధాని.. శివుడికి ప్రత్యేక పూజలు

Modi In Kedarnath Temple : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో పర్యటిస్తున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో శివుడికి మహా రుద్రాభిషేకం చేశారు. స్వామి వారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు మోడీ. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 12 అడుగుల ఎత్తు 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పులు తయారు చేశారు. 2013 వరదల కారణంగా దెబ్బతిన్న ఆది శంకరా చార్యుల సమాధిని ఇటీవల పునరుద్ధరించారు.
సరస్వతి రిటైనింగ్ వాల్, మందాకిని రిటైనింగ్ వాల్ సహా తీర్థ పురోహితుల కోసం నిర్మించిన ఇళ్లు, మందాకిని నదిపై నిర్మించిన గరుడ్ చట్టి బ్రిడ్జిని మోడీ ప్రారంభిస్తారు. ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు సహా నాలుగు శంకరా చార్య మఠాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఆ తర్వాత అక్కడ నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మోడీ పాల్గొంటారు. అంతకుముందు....డెహ్రాడూన్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ దామి. మోడీ పర్యటన నేపథ్యంలో కేదార్నాథ్ లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com