అమ్మ నాకు ఫోన్ చేసిన ప్రతిసారి అడిగే ఓ విషయం: మోదీ

ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా "ఫిట్ ఇండియా డైలాగ్" లో ఫిట్‌నెస్‌పై దేశ పౌరులను ప్రభావితం చేసేవారితో ప్రధాని మోదీ సంభాషించారు. ఆన్‌లైన్‌లో పాల్గొన్న వారు వారి ఫిట్‌నెస్ ప్రయాణంలోని చిట్కాలు పంచుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితం యొక్క అలవాట్లపైప్రధానమంత్రి తన ఆలోచనలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, మోడల్ నటడు కూడా అయిన మిలింద్ సోమన్, న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ ఇతర ఫిట్‌నెస్ ప్రభావశీలులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని తన డైట్ రహస్యాన్ని వెల్లడించారు. వారానికి రెండు సార్లు మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది. మాట్లాడిన ప్రతిసారి పసుపు వాడుతున్నావా అని అడుగుతుంది. నేను కూడా సోషల్ మీడియాలో పసుపు వాడకం గురించి చాలా సార్లు మాట్లాడా అని ప్రధాని మోదీ న్యూట్రీషియనిస్ట్‌తో అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com