Pm Modi : కరోనాపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

Pm Modi : కరోనా మహమ్మారి భారత్‌పై మరోసారి దండెత్తుతోంది. ఒక్కరోజులోనే రెండున్నర లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది మే తరువాత ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి అంటున్నారు శాస్త్రవేత్తలు. థర్డ్‌వేవ్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది.
కరోనా విజృంభిస్తుండటంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాలు నిబంధనలు కఠిన అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తుండగా.. మరికొన్ని వీకెండ్ లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5వేల 488 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది.
కొవిడ్ పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మరుతునన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిని తెలుసుకోనున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com