Narendra Modi : ఈనెల 28న ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

Narendra Modi : ఈనెల 28న ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశానికి అన్ని పార్టీ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సిఫార్సు చేసింది. కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని సూచించింది. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు జరగలేదు. ఆ తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలను కుదించారు. ఈసారి ఉభయసభలు 20 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.
ఈనెల 28న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం అనంతరం మధ్యాహ్నం ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ జరగనుంది. ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నిలు, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com