కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం..

కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలపై చర్చించేందుకు కేంద్ర కేబినేట్ భేటీ జరగనుంది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలపై చర్చించేందుకు కేంద్ర కేబినేట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కరోనా నియంత్రణ, వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఫేజ్ 3 వ్యాక్సినేషన్ లో భాగంగా మే ఒకటి నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి టీకా వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించకుంది.

ఈ క్రమంలోనే సాయంత్రం 6 గంటలకు టీకా తయారీ సంస్థలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బయోటెక్నాలజీ విభాగం ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు కంపెనీలను సమన్వయం చేసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ టీకా తయారీదారులతో పాటు విదేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాక్సిన్ తయారీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు టీకాలకు అనుమతి ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story